: లగడపాటికి పట్టిన గతే రేవంత్ రెడ్డికీ పడుతుంది: కర్నే ప్రభాకర్
రేవంత్ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోకుంటే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కి పట్టిన గతే రేవంత్ కి కూడా పడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో విద్యుత్ కష్టాలకు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలే కారణమని అన్నారు. భరోసా, బస్సు యాత్రల పేరిట కాంగ్రెస్, టీడీపీ నేతలు రైతులను తెలంగాణ ప్రభుత్వంపైకి రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు బానిసలుగా మారారని ఆయన ఎద్దేవా చేశారు.