: హుదూద్ ప్రతాపం అప్పుడే ప్రారంభమయింది
పెను తుపాను హుదూద్ తీరాన్ని ఇంకా తాకక ముందే దాని ప్రభావం మాత్రం అప్పుడే మొదలైంది. తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. విద్యుత్ తీగలు తెగి పడే అవకాశం ఉండటంతో... జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.