: మలాలాకు నోబెల్ బహుమతి ప్రకటనను ఖండించిన తాలిబన్లు


పాకిస్థాన్ బాలిక మలాలా యూసుఫ్ జాయ్ కు నోబెల్ బహుమతి ప్రకటనను తాలిబన్ ఉగ్రవాదులు ఖండించారు. అవిశ్వాసుల ప్రతినిధిగా మలాలాను అభివర్ణించిన తాలిబన్ల అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ నేత ఎహ్సానుల్లా ఎహ్సాన్, తన అనుచరులతో కలసి ఈ మేరకు ట్విట్టర్లో ఖండన ప్రకటనలను పోస్ట్ చేశాడు. 2012లో విద్యాభ్యాసాన్ని మానుకోవాలన్న తాలిబన్ల ఆంక్షలను ధిక్కరించిన కారణంగానే సదరు సంస్థ ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనతోనే మలాలాకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించింది. మలాలాపై దాడికి దిగిన మిలిటెంట్లను అరెస్ట్ చేసినట్లు గత నెల పాక్ సైన్యం ప్రకటించింది. తాలిబన్ నేత ముల్లా ఫజ్లుల్లా ఆదేశాల మేరకే మలాలాపై నాడు దాడికి దిగామని అరెస్టైన ఉగ్రవాదులు అంగీరించారు. ఇదిలా ఉంటే, మలాలాకు నోబెల్ బహుమతి ప్రకటనను ఖండించిన సందర్భంగానూ, ఎహ్సాన్ తన నిజ స్వరూపాన్ని చాటుకున్నాడు. ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించే వారిపై ఇకపైనా తాము చర్యలు తీసుకుంటామని అతడు ప్రకటించాడు.

  • Loading...

More Telugu News