: కేంద్రానికి ఇద్దరు సీఎస్ ల ఉమ్మడి లేఖ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడిగా లేఖ రాయాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల విభజన ఇంతవరకు జరగకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో పాలన కుంటుబడిందని... దీంతో, అధికారుల విభజనను వెంటనే చేపట్టాలని లేఖలో కోరనున్నారు. వ్యక్తిగత సమస్యలున్న అధికారులను మినహాయించి, మిగిలిన వారిని వెంటనే విభజించాలని విజ్ఞప్తి చేయనున్నారు.