: ఐఓసీ, హెచ్ పీసీఎల్ లు హైదరాబాద్ లో పన్నులు కట్టట్లేదు: జైట్లీకి కేసీఆర్ ఫిర్యాదు
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు హైదరాబాద్ లో పన్నులు కట్టడం లేదని, ఆంధ్రప్రదేశ్ లో ఆ సంస్థలు తమ పన్నులను చెల్లిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సదరు సంస్థలు హైదరాబాద్ లో పన్నులు చెల్లించేవని, అయితే రాష్ట్ర విభజన తర్వాత అందుకు విరుద్ధంగా ఏపీలో పన్నులు చెల్లిస్తున్నాయని ఆయన వాపోయారు. దీంతో హైదరాబాద్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ శనివారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆర్థిక మంత్రితో ఆయన చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం ఎలా ఉందన్న జైట్లీ ప్రశ్నతో కేసీఆర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణకు ప్రత్యేక హోదాతో పాటు పన్ను రాయితీలను అందించాలని ఈ సందర్భంగా ఆయన జైట్లీని కోరారు.