: నన్ను కార్తీక్ గౌడ భార్యగా ప్రకటించండి: కోర్టులో కన్నడ నటి మేత్రేయి పిటిషన్
తనను రహస్యంగా పెళ్లి చేసుకుని మరో మహిళతో వివాహానికి సిద్ధపడ్డాడని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నడ నటి మైత్రేయి, ఈసారి బెంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈసారి అతడిపై చర్యలు తీసుకోమని ఆమె కోరడం లేదు. తనను అతడి భార్యగా ప్రకటించమని కోర్టును కోరుతోంది. గతంలోనే తనను రహస్యంగా వివాహం చేసుకున్న కార్తీక్, తనను భార్యగా స్వీకరించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాది ఆకాశ్ ఖాంద్రే బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల 15న విచారణకు రానున్నట్లు సమాచారం. పిటిషన్ విచారణకు వచ్చిన రోజే తమకు అనుకూలంగా తుది తీర్పు కూడా రానుందని ఖాంద్రే ధీమా వ్యక్తం చేస్తున్నారు.