: ఆ దేశాల రాయితీల యుద్ధం... మన ఇంధన ధరలను తగ్గిస్తోంది!


ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య నెలకొన్న రాయితీల యుద్ధం, మన పెట్రోల్, డీజిల్ ధరలను మరింతగా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన జూన్ నెల నుంచి అంతర్జాతీయ చమురు మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 20 శాతం మేర తగ్గింది. శుక్రవారం మరింత తగ్గిన ఈ ధర బ్యారెల్ కు 90 డాలర్ల వద్ద నిలిచింది. అయితే తాజాగా సౌదీ అరేబియా పోటీతో తన మార్కెట్ వాటాను నిలుపుకునేందుకు బ్యారెల్ ముడి చమురు ధరను ఇరాన్ ఒక డాలర్ మేర తగ్గించింది. సౌదీ అరేబియా కూడా ఇదే రీతిన డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించడంతో సోమవారం నాటికి ముడి చమురు ధర బ్యారెల్ కు మరింతగా తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పలుమార్లు తగ్గించింది. ముడి చమురు ధరలు మరింతగా తగ్గిన నేపథ్యంలో వినియోగదారులు ఇంధన ధరలను మరోమారు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే లీటర్ డీజిల్ పై రూ.3 మేర ధరను తగ్గించేందుకు కేంద్రం సమాయత్తమవుతోందని సమాచారం. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు క్రమంగా పతనమవుతున్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇంధన ధరలను ఒకేసారి తగ్గించేందుకు జంకుతోంది. అయితే రానున్న నెల, రెండు నెలల వ్యవధిలో డీజిల్, పెట్రోల్ ధరలు మరింతగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News