: 'హుదూద్'పై ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించిన కేసీఆర్


రానున్న కొన్ని గంటల్లో విరుచుకుపడనున్న హుదూద్ తుపానుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మంత్రులు కూడా అందుబాటులో ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తనకు సమాచారాన్ని అందజేయాలని కోరారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News