: జైల్లో ఆరోగ్యంగానే జయలలిత


అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఆరోగ్యంగానే ఉన్నారట. ఈ మేరకు కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ జయసింహ తెలిపారు. శశికళ, ఇళవరసిలతో కలిసి ఒకే గదిలో ఉన్న జయలలిత సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు ముగ్గురికీ నిద్రించేందుకు మంచాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. జయలలితను తమిళనాడు జైలుకు తరలిస్తున్నారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. గత నెల 27 నుంచి తమిళనాడు నూతన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కాని, ప్రభుత్వంలోని ఇతర సీనియర్ అధికారులు కాని జయలలితను కలవలేదన్నారు. వైద్యుల సలహా మేరకు జయలలిత కోరిన ఆహారాన్నే ఆమెకు అందిస్తున్నామని ఆయన చెప్పారు. నిత్యం వార్తా పత్రికలు చదువుతున్న జయలలిత, సాధారణ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారన్నారు.

  • Loading...

More Telugu News