: శ్రీవారి సమాచారం
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్ల జారీని, ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ప్రత్యేక ప్రవేశదర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ ఉదయానికి 26 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,529 మంది భక్తులు దర్శించుకున్నారు.