: సుప్రీంలో సోమవారం జయ బెయిల్ పిటిషన్ పై విచారణ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. అత్యవసరంగా విచారించాల్సిన కేసుల జాబితాలో దాఖలైన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సోమవారం నాటి విచారణకు అనుమతించనున్నట్లు జయ తరఫు న్యాయవాదులు అంచనా వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 100 కోట్ల జరిమానాకు గురైన విషయం తెలిసిందే. జయ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.