: సాహస బాలిక మలాలాతో కలసి భారతీయుడికి నోబెల్ శాంతి పురస్కారం


ప్రతిష్ఠాత్మక 2014 నోబెల్ శాంతి పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఈసారి ఇద్దరికి ప్రకటించింది. భారత్ కు చెందిన బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థి, పాకిస్థాన్ బాలిక మలాల యూసఫ్ జాయ్ కు నోబెల్ శాంతి పురస్కారం సంయుక్తంగా లభించింది. 'బచ్ పన్ బచావో ఆందోళన్' సంస్థ నిర్వాహకుడైన సత్యార్థి... నోబెల్ పురస్కారానికి ఎంపికైన ఏడవ భారతీయుడు. అటు తీవ్రవాద కాల్పుల్లో గాయపడినా, మొక్కవోని ధైర్యంతో, ప్రస్తుతం బాలికల విద్యకోసం నిధులు సేకరిస్తూ మలాలా హక్కుల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. పదిహేడేళ్ల వయసులోనే నోబెల్ శాంతి పురస్కారం పొందిన వ్యక్తిగా మలాలా రికార్డు సృష్టించనుంది.

  • Loading...

More Telugu News