: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెలంగాణలో రాష్ట్ర విద్యుత్ సమస్య కేసీఆర్ కు ముందే తెలిసినా... దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎంతో ముందు చూపుతో తాము యూనిట్ విద్యుత్ ను రూ. 5.50కే కొన్నామని... ఏపీలో విద్యుత్ కొరత లేకుండా చేశామని చెప్పారు. కేసీఆర్ కు ముందు చూపు లేకపోవడం వల్లే ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని తెలిపారు. 'మా ఎమ్మెల్యేలనే లాక్కొని మా పైనే విమర్శలు చేస్తున్నారని' కేసీఆర్ పై చంద్రబాబు మండిపడ్డారు. ఈ రోజు నెల్లూరులో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News