: చంద్రబాబుతో చర్చించే దమ్ము కేసీఆర్ కు ఉందా?: నారా లోకేశ్ సవాల్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు టీడీపీ యువనేత నారా లోకేశ్ సవాల్ విసిరారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారన్న అంశంపై తమ అధినేత చంద్రబాబుతో చర్చించే దమ్ము కేసీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఎందుకు నెలకొంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎందుకు నాశనమవుతోంది? అంటూ లోకేశ్ ట్విట్టర్లో ప్రశ్నించారు.