: హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఫ్రీ వైఫై సేవలు ప్రారంభం


హైదరాబాదులోని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వైఫై సేవలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తో కలసి ఉచితంగా ఈ సేవలను ప్రభుత్వం అందిస్తోంది. దాంతో హైటెక్ సిటీ ప్రాంతాలైన మాదాపూర్, కొత్తగూడ క్రాస్ రోడ్, రహేజా మైండ్ స్పేస్, కొండాపూర్ లలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఒక్కో వినియోగదారుడు 750 ఎంబీ ఇంటర్నెట్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. వైఫై నగరంగా హైదరాబాదును అభివృద్ధి చేస్తామని, వైఫై సేవలను అందించేందుకు త్వరలో టెండర్ల పిలువనున్నట్లు కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. నగరాన్ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా చేయడంలో భాగంగా ఇది తొలి అడుగన్నారు.

  • Loading...

More Telugu News