: బీజేపీ, కాంగ్రెస్ లకు భారీ రాజకీయ విరాళాలు


దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు రాజకీయ విరాళల కింద భారీ మొత్తం వచ్చినట్లు ఎన్నికల సంఘంలో నమోదైన ఎలక్టోరల్ ట్రస్ట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2013-14కుగానూ బీజేపీ రూ.41 కోట్లు, కాంగ్రెస్ రూ.36 కోట్లు విరాళంగా పొందినట్లు తెలిపింది. భారతీ గ్రూప్ కు చెందిన ఈ ట్రస్టు ఈసీ గుర్తించిన ఏడు ఎన్నికల ట్రస్టుల్లో ఒకటి. అంతేగాక పన్ను మినహాయింపు ప్రయోజనాల నేపథ్యంలో సెంట్రల్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ వద్ద కూడా రిజిస్టర్ అయింది. అటు శిరోమణి అకాళీదల్ కు రూ.2 కోట్లు, ఆర్జేడీకి రూ.కోటి, ఎన్సీపీకి రూ.4 కోట్లు, జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కు రూ.50 లక్షలు విరాళాలుగా వచ్చినట్లు ట్రస్టు వివరించింది.

  • Loading...

More Telugu News