: వాద్రా భూ వ్యవహారం... పదేళ్ల లూటీ: సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూ వ్యవహారాన్ని పదేళ్ల లూటీగా సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా అభివర్ణించారు. హర్యానాలో వెలుగుచూసిన ఈ వ్యవహారాన్ని అశోక్ ఖేమ్కానే వెలికితీశారు. అయితే, అందుకు ప్రతిఫలంగా ఆయన హర్యానా సర్కారు చేతిలో బదిలీ వేటుకు గురయ్యారు. వాద్రా భూ వివాదంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందులో ఎలాంటి ఎన్నికల నియమావళి అతిక్రమణ జరగలేదని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. దీనిపై అశోక్ ఖేమ్కా స్పందిస్తూ, ఎన్నికల నియమావళి అతిక్రమణపై మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించిందని, అయితే వాద్రా వ్యవహారంలో అవినీతి జరగలేదని ఎన్నికల సంఘం చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. పదేళ్ల పాటు జరిగిన లూటీని ఎన్నికల సంఘం వివరణతో కప్పిపెట్టడం సాధ్యం కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన పరిధి వరకే ఎన్నికల సంఘం ప్రతిస్పందించిందని, అంతేకాక వాద్రాకు ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News