: నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కోవూరు నియోజకవర్గంలో జరిగే పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అక్కడి డ్వాక్రా మహిళలతో సమావేశమవుతారు. ఆ తర్వాత వెంకటగిరిలో జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు.