: సమస్యలు పరిష్కరించాల్సింది బాబు కాదు, కేసీఆరే!: కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం


ప్రాణమున్నంత వరకు టీడీపీతోనే కొనసాగుతానని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధినేతను విమర్శిస్తూనే విద్యుత్ ఎలా అడుగుతారని ప్రశ్నించారు. తనను టీఆర్ఎస్ లోకి రమ్మని ప్రలోభ పెట్టారని ఆయన వెల్లడించారు. తాను, తీగల, తలసాని, మరి కొంతమంది నేతలు ఏనాడూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయలేదని తెలిపారు. సమైక్య రాష్ట్రాన్నే తాము కోరుకున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన పూర్తైన తరువాత తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని, తమ సమస్యలు పరిష్కరించేందుకు చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన వివరించారు. ఆయనను ఆడిపోసుకున్నంత మాత్రాన తెలంగాణ సమస్యలు పరిష్కారం కావని, సమస్యలు పరిష్కరించాల్సిన భాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపడం మానేసి, విద్వేషాలు రగల్చడంపై దృష్టి పెడుతోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంలా విమర్శలు చేయడం మానేసి సమస్యల పరిష్కారంపై టీఆర్ఎస్ దృష్టి సారించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News