: శశి థరూర్ కు దిగ్విజయ్ సింగ్ మద్దతు


ప్రధానమంత్రి నరేంద్రమోడీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ను ఆహ్వానించడం, మోడీని థరూర్ పొగడడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని కూడా డిమాండ్ చేశారు. కానీ, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ థరూర్ కు మద్దతు తెలిపారు. కేరళ ఎంపీ (థరూర్) చర్యలో తప్పులేదన్నారు. "స్వచ్ఛ భారత్' బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు థరూర్ అంగీకరించడంలో ఎలాంటి తప్పులేదు. కాంగ్రెస్ కార్యక్రమమైన దాన్ని మోడీ అడాప్ట్ చేసుకున్నదే" అని దిగ్విజయ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News