: విద్యుత్ సమస్యపై కేంద్రంతో చర్చించకుండా, బాబును తిడితే ప్రయోజం ఉంటుందా?: రేవంత్
తెలంగాణ విద్యుత్ శాఖను టీటీడీపీకి అప్పగిస్తే, అసెంబ్లీ సమావేశాల్లోపు రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ శాసససభా పక్ష ఉపనేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ, అలా చేయలేకపోతే తాము తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెబుతామన్నారు. ఒకవేళ, తాము విద్యుత్ సమస్యను పరిష్కరించగలిగితే కేసీఆర్ క్షమాపణ చెబుతారా? అని సవాల్ విసిరారు. విద్యుత్ సమస్యపై కేంద్రంతో చర్చించకుండా, చంద్రబాబును తిడితే ప్రయోజనం ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో చేరుతున్న టీడీపీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పే క్షణం వరకే కేసీఆర్ కనపడతారని, ఆ తర్వాత కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా వారికి దొరకదని రేవంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు.