: విడాకులకు అప్లై చేసిన మ్యాట్రిక్స్ ప్రసాద్ దంపతులు


ప్రముఖ పారిశ్రామిక వేత్త.. 'మా' టీవీ అధినేత 'మ్యాట్రిక్స్' ప్రసాద్, ఆయన భార్య ఆశా విడాకులు కోరుకుంటూ హైదరాబాద్ లోని ఫ్యామిలీ కోర్టులో డైవోర్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మ్యాట్రిక్స్ ప్రసాద్ కు చాలా సంవత్సరాల క్రిందట అరుణ అనే మహిళతో మొదటి వివాహం జరిగింది. వీరిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రస్తుత భార్య 'ఆశ'ను రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఇరువురు ఇష్టపూర్వకంగా పరస్పర ఆమోదంతో విడాకులకు అప్లై చేసారని సన్నిహితవర్గాల సమాచారం. జగన్ అక్రమాస్తుల కేసుల్లో మ్యాట్రిక్ ప్రసాద్ సహ నిందితుడిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News