: రాంజెఠ్మలానీ స్థానంలో హరీశ్ సాల్వే: జయ లలిత కేసులో న్యాయవాది మార్పు


అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. దీనిపై జయలలిత, ఆమె పార్టీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే అందులో చిన్న మార్పు జరిగినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో తన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించే న్యాయవాదుల విషయంలో జయలలిత భారీ మార్పునే చేశారట. ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీతో పనికాదని భావించిన జయలలిత, ఆయనను తప్పించి, హరీశ్ సాల్వేను న్యాయవాదిగా పెట్టుకోవాలని నిర్ణయించారట. అనుకున్నదే తడవుగా సుప్రీంలో తన బెయిల్ పై హరీశ్ సాల్వే వాదనలు వినిపించేలా చూడాలని తన అనుచరులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాంజెఠ్మలానీ స్థానంలో ఇకపై హరీశ్ సాల్వే, జయ న్యాయవాదిగా కొనసాగనున్నారు. రాంజెఠ్మలానీ నిర్లక్ష్యం వల్లే, కర్ణాటక హైకోర్టులో తనకు బెయిల్ రాలేదని జయ భావిస్తున్నారట.

  • Loading...

More Telugu News