: పాక్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ


సరిహద్దు వెంట పాకిస్తాన్ రేంజర్లు జరుపుతున్న కాల్పులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్నా, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగా స్పందించారు. ‘‘కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్తానే, ఇరు దేశాల మధ్య మనస్పర్థలకు కారకురాలవుతోంది. ఈ విషయం పాక్ కు కూడా తెలుసు. మా నుంచి ఎదురయ్యే ప్రతీకార చర్యలను ఆ దేశం ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పటికైనా పాక్ వైఖరిలో మార్పు రాని పక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని అరుణ్ జైట్లీ స్పందించారు. ‘‘భారత్ ఎప్పుడూ దుందుడుకుగా వ్యవహరించబోదు. భారత్ బాధ్యత కలిగిన దేశం. అయితే తన ప్రజలను కాపాడుకునే విషయంలో మాత్రం రాజీ పడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News