: టీఆర్ఎస్ లో తలసాని, తీగల చేరిక ఖరారు
టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తెలంగాణ టీడీపీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు తాము పార్టీలో చేరనున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్యాంప్ కార్యాలయంలో కలసిన వారు పార్టీలో చేరేందుకు అంగీకరించారు. కొన్ని రోజుల నుంచీ ఈ ఐదుగురు టీడీపీని వీడుతున్నట్లు ఊహాగానాలు, వార్తలు వచ్చినా నేటితో ఆ అనుమానాలకు తెరపడింది.