: ‘గోద్రా’ బాధితుల్లా చేతులు ముడుచుకుని కూర్చోం: మోడీపై బిలావల్ వ్యాఖ్య


పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ గౌరవాధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ భారత ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలకు మరింత పదును పెంచాడు. భారత్ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని తాజాగా వ్యాఖ్యానించిన బిలావల్, ‘‘గుజరాత్ బాధితుల్లాగా, తాము ప్రతీకారం తీర్చుకోలేమనుకుంటున్నారా? తప్పనిసరిగా తిప్పికొడతాం. ఈ విషయాన్ని మోడీ తెలుసుకోవాలి’’ అంటూ అతడు తన పార్టీ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నాడు. పాక్ పై భారత్, ఇజ్రాయెల్ తరహా వైఖరిని అవలంబిస్తోందని కూడా బిలావల్ ఆరోపించాడు. ప్రధాని నరేంద్ర మోడీపై బిలావల్ ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ హ్యాకర్లమంటూ రంగంలోకి దిగిన కొందరు వ్యక్తులు ఆ పార్టీ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు.

  • Loading...

More Telugu News