: షారూక్ ఖాతాలో మరో ఎండార్స్ మెంట్


గృహోపకరణాల సంస్థ కెన్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా షారూక్ ఖాన్ వ్యవహరించనున్నారు. బాలీవుడ్ బాద్షాతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నామని కెన్ స్టార్ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో తాము అందించనున్న నూతన ఉత్పత్తులకు షారూక్ ప్రచారం చేస్తారని వెల్లడించింది. కెన్ స్టార్ కుటుంబంలో షారూక్ అడుగుపెట్టడం సంతోషంగా ఉందని ప్రకటించింది. మరోవైపు, కెన్ స్టార్ లాంటి ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని షారూక్ తెలిపారు.

  • Loading...

More Telugu News