: వాహనదారులకు శుభవార్త!


వాహనదారులకు శుభవార్త! పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 27 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో లీటరు డీజిల్‌ పై 2.50 పైసలు తగ్గే అవకాశముండగా, లీటర్ పెట్రోల్‌ పై రూపాయి తగ్గే అవకాశముంది. కాగా, ఈ తగ్గింపులు అక్టోబర్ 15న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తరువాత అమలులోకి వచ్చే అవకాశముంది. గత ఏడాది జనవరిలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ డీజిల్ ధరను నెలకు 40 నుంచి 50 పైసల చొప్పున పెంచాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ప్రతి నెలా డీజిల్ ధర పెరుగుతోంది. అయితే డీజిల్ కంపెనీలు లాభాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఎత్తి వేసే సూచనలు కనబడుతున్నాయి.

  • Loading...

More Telugu News