: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్... కొచ్చి వన్డేకు తొలగిన అడ్డంకులు
కొచ్చి వన్డేకు ఆటంకాలు తొలగిపోయాయి. విండీస్ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్ళకు మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం విండీస్ జట్టు మైదానంలోకి ప్రవేశించడంతో మ్యాచ్ నిర్వహణపై ఆశలు చిగురించాయి. టాస్ వేయడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. ఈ డే/నైట్ మ్యాచ్ లో టీమిండియా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది.