: కొచ్చి వన్డేకు విండీస్ ఆటగాళ్లు గైర్హాజరవ్వొచ్చు: వెస్టీండీస్ క్రికెట్ బోర్డు


భారత్- వెస్టిండీస్ మధ్య ఈ మధ్యాహ్నం జరగాల్సిన వన్డే మ్యాచ్ దాదాపు రద్దయ్యేలా కనిపిస్తోంది. ఈ మేరకు అభిమానులకు క్షమాపణ చెప్పిన వెస్టీండీస్ క్రికెట్ బోర్డు... కొంతమంది విండీస్ ఆటగాళ్లు వన్డే మ్యాచ్ కు హాజరుకాకుండా ఉండేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను వెస్టీండీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. "అభిమానులకు, బీసీసీఐకి, ఇతర స్టేక్ హోల్డర్లకి క్షమాపణ చెబుతున్నాము. ఆటగాళ్ల చర్యల ఫలితం నేపథ్యంలో భారత్-విండీస్ మొదటి వన్డే రద్దయ్యే అవకాశం ఉంది. ఆటగాళ్లు చేసిన డిమాండులన్నింటినీ తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము" అని విండీస్ బోర్డు తెలిపింది.

  • Loading...

More Telugu News