: తెలంగాణ రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మొత్తం తెలంగాణను డిజిటలైజ్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు అని... పన్నులు, ఆదాయం విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తామని చెప్పారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో ప్రతి వ్యక్తినీ భాగస్వామిని చేస్తామని అన్నారు. హైదరాబాదులో జరుగుతున్న మెట్రోపొలిస్ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తెలంగాణకు సంబంధించిన సమగ్ర వివరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించామని... సర్వే సమాచారంతో అన్ని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు సర్వే జరిగిందని చెప్పారు. ఒకే రోజు కోటి ఇళ్లలో సర్వే చేశామని తెలిపారు.