: ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం: బీజేపీ
తీవ్ర విద్యుత్ లోటుతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. వారానికి రెండు రోజుల పాటు తెలంగాణలోని పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయలేమని స్పష్టం చేసింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా... పవర్ హాలిడే ప్రకటించడమేంటని ఆయన ప్రశ్నించారు.