: ఢిల్లీలో కిరణ్, బొత్సా .. కళంకిత మంత్రులపై అధిష్ఠానంతో చర్చలు
అధిష్ఠానం పిలుపుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యన్నారాయణ ఢిల్లీకి చేరుకున్నారు. అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్ సమావేశమయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో పలువురు రాష్ట్ర మంత్రులు నిందారోపణలు ఎదుర్కొంటూ సిబిఐ చార్జ్ షీటులోకి ఎక్కిన సంగతి తెలిసిందే. వీరి విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. మచ్చపడ్డవారిని తప్పించి కొత్తగా వేరేవారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ఊహాగానాలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ కూడా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ అజాద్ తో సమావేశమై నేతల వలసలు, తెలంగాణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.