: థాయ్ లాండ్ లో పడవ ప్రమాదం... ముగ్గురు హైదరాబాదీల మృతి
థాయ్ లాండ్ లో పడవ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో యువ పారిశ్రామికవేత్త (సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) యశ్ అగర్వాల్ (27), ఆయన భార్య పంకూరి మిఠల్ (26), మరో వ్యక్తి మృతి చెందారని అక్కడి అధికారులు సమాచారం అందించారు. మృతులందరూ బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నారు.