: బలపడుతున్న వాయుగుండం... తుపానుగా మారే అవకాశం
అండమాన్ దీవుల తీరంలో ఏర్పడిన వాయుగుండం క్రమేణా బలపడుతోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం లాంగ్ ఐలాండ్ కు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయింది. రానున్న 24 గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈ నెల 12న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.