: నేడు చంద్రగ్రహణం... వివిధ ప్రాంతాల నుంచి వీక్షించే అవకాశం


ఈరోజు (బుధవారం) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భూ అధ్యయన శాస్త్ర మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం... మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 6.05 గంటల వరకు కొనసాగుతుంది. ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చంద్రోదయం సమయంలో మన దేశంలోని పశ్చిమ ప్రాంతం వారికి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల వారికి గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. అయితే, గ్రహణం వీడే సమయంలో మాత్రం దేశంలోని పలు ప్రాంతాల వారు చూసే అవకాశం లభిస్తుంది.

  • Loading...

More Telugu News