: బిల్ గేట్స్ వ్యాసంలో మోడీ
ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తన బ్లాగ్ లో 'మీటింగ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్' అనే వ్యాసాన్ని రాశారు. అందులో భారత ప్రధాని మోడీతో భేటీ విశేషాలు, మోడీపై తన అభిప్రాయాలను వెల్లడించారు. గత నెలలో గేట్స్ దంపతులు భారత్ వచ్చిన సందర్భంలో ప్రధాని మోడీని కలుసుకున్నారు. ఈ సందర్భంలో మోడీ పేదల గురించే మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. పేదల ఆరోగ్యస్థితి, వ్యాక్సిన్లు, హెల్త్ సెంటర్లు, బ్యాంకు ఖాతాల గురించే చర్చించామని గేట్స్ తెలిపారు. భారత్ లో ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులోకి తేవాలని, మారుమూల ప్రాంతాల్లో కూడా మరుగుదొడ్లు నిర్మించాలని, పేదరికాన్ని అంతమొందించాలని భారత ప్రధాని నిబద్ధతతో చేస్తున్న పోరాటం తనను ఆకట్టుకుందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.