: అసలు బెయిల్ ఎందుకివ్వాలి?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టులో వాద, ప్రతివాదనలు ఆసక్తికరంగా జరిగాయట. విఖ్యాత న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించినా, సీబీఐ తరపు న్యాయవాది ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పినా బెయిల్ మంజూరుకాకపోవడం విశేషం. వాదనలన్నీ విన్న న్యాయమూర్తి అసలు జయలలితకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదని అన్నారు. అంతకు ముందు సీబీఐ న్యాయవాది ఆమెకు బెయిల్ మంజూరు చేయడంపై తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు. దీంతో అమ్మకు బెయిల్ వచ్చేసిందని తమిళనాట ప్రచారమైంది. దీంతో కోర్టు బయట, తమిళనాట పండుగ వాతావరణం నెలకొంది. అయితే, న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడానికి కారణం కనిపించడం లేదని స్పష్టం చేయడంతో అంతా ఆందోళనలో పడ్డారు.