: మెరుగుపడుతున్న డాలర్ శేషాద్రి ఆరోగ్యం
తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. ఈ రోజు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు. శేషాద్రికి డయాబెటిస్ ఉండటంతో ఆపరేషన్ నిర్వహించకుండా టాబ్లెట్లతోనే ఆరోగ్యం బాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. అయితే, మరో మూడు నెలల పాటు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.