: కేంద్ర మంత్రిపై షూ విసరబోయిన యువకుడి అరెస్టు
పూణెలోని ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ఓ యువకుడు షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న బీజేపీ కార్యకర్తలు అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దాంతో, పార్టీ అభ్యర్థి మేధా కులకర్ణికి మద్దతుగా మంత్రి ప్రసంగం ప్రశాంతంగా జరిగింది. అయితే అతడు తాగి ఉన్నాడని, వివరాలేమి తెలియరాలేదని, అతడిని విచారిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.