: కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు కేసీఆర్ నిర్ణయం


తెలంగాణ ప్రభుత్వానికి సొంత హెలికాప్టర్ లేకపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వివిధ కార్యక్రమాలకు తక్కువ సమయంలో హాజరు కావడానికి ప్రభుత్వానికి సొంత హెలికాప్టర్ ఉండాలని ఆయన భావిస్తున్నారు. దీంతో, ఓ హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందుబాటులో ఉన్న హెలికాప్టర్లను పరిశీలించి... మంచి దాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ హెలికాప్టర్ ను సీఎంతో పాటు, వీఐపీల రాష్ట్ర పర్యటనలకు వినియోగిస్తారు.

  • Loading...

More Telugu News