: సురేష్ రైనాను టెస్ట్ జట్టులోకి తీసుకొస్తా: రవిశాస్త్రి


సురేశ్ రైనాను భారత టెస్ట్ జట్టులో మళ్లీ తాను చూడాలనుకుంటున్నానని ఇండియన్ క్రికెట్ టీం డైరక్టర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇందుకోసం తాను గట్టిగా ప్రయత్నిస్తానని ఆయన చెప్పాడు. రైనాను టెస్ట్ జట్టులోకి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని ఆయన తెలిపాడు. రైనా ఓ క్లాస్ ఆటగాడని... కేవలం అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రమే కాకుండా...నెట్స్ లో కూడా రైనా ఎంతటి ప్రత్యేక ఆటగాడో తనకు అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించాడు. రైనా నెట్స్ లో ఆడుతున్నప్పుడు, బ్యాట్ ను బంతి తాకినప్పటి శబ్దం వింటే... అతని టైమింగ్ ఎంత బాగుంటుందో, భిన్నంగా ఉంటుందో తెలుస్తుందని రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.

  • Loading...

More Telugu News