: 13 ఏళ్లగా కేవలం నీరే ఆహారం!


ఎటువంటి ఆహారం తీసుకోకుండా, 13 ఏళ్లుగా కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ అందరినీ అశ్చర్యపరుస్తున్నాడు ఓ మాజీ సైనికుడు. తమిళనాడుకు చెందిన ఇనియన్‌ ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈరోడ్‌ జిల్లా గోబిశెట్టి పాళయంలో నివాసం ఉంటున్న ఈయన రోజు మొత్తం మీద నీటిని త్రాగడం తప్ప మరే పదార్థాన్ని కానీ పానీయాన్ని కానీ పుచ్చుకోడు. కేవలం నీటిని తీసుకునే పుష్కరకాలంపైగా ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. జీవితం పట్ల వైరాగ్యంతో బాటు దైవచింతన వలనే ఇది సాధ్యమయిందని ఆయన చెబుతున్నారు. సాధన చేస్తే, తాను జీవించిన విధంగా ప్రతీ ఒక్కరూ జీవించవచ్చని ఇనియన్ అంటున్నారు. ఈ జలాహారంతో ఎలాంటి ఆరోగ్యసమస్యలు రావని, ఈ విధానంపై తాను ఇప్పటికే పలువురికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News