: ప్రభుత్వ మాజీ సలహాదారు, నిర్మాత సీసీ రెడ్డి కన్నుమూత
ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వైఎస్సార్ ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వ సలహాదారుగా పని చేశారు. న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన సీసీ రెడ్డి, అమెరికాలో పలు సంస్థలకు సీఈవోగా పని చేశారు. వ్యాపారదక్షుడిగా పలువురి మన్ననలు అందుకున్నారు. సీసీ రెడ్డి 'రూమ్ మేట్స్', 'మీ శ్రేయోభిలాషి', 'గౌతమ్ ఎస్ఎస్సీ' వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తన అభిరుచిని తెలిపారు.