: పీఎస్ఎల్ వీ-సీ26 ప్రయోగం వాయిదా


ఈ నెల 10న నింగిలోకి దూసుకెళ్లాల్సిన పీఎస్ఎల్ వీ-సీ26 ప్రయోగాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లో పీఎస్ఎల్ వీ-సీ26 రాకెట్ కు సంబంధించిన మిషన్ రెడినర్ సమీక్ష (ఎమ్ఆర్ఆర్) జరిగింది. ఈ సమీక్షకు అధ్యక్షులుగా సీనియర్ శాస్త్రవేత్త బీఎన్ సురేష్ వ్యవహరించగా, సాయంత్రం జరిగిన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశానికి ఛైర్మన్ ఎమ్ వైఎస్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ రెండు సమావేశాల్లో పీఎస్ఎల్ వీ-సీ26 ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు. మొదటి ప్రయోగ వేదికపై ఉన్న పీఎస్ఎల్ వీ-సీ26ని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

  • Loading...

More Telugu News