: ఫేస్ బుక్ కొంపముంచింది


ఫేస్ బుక్ ఓ వ్యక్తి కొంపముంచింది. ఫేస్ బుక్ లో 'పోకింగ్' అనే అప్షన్ ఉంటుంది. ఫేస్ బుక్ లో ఎవరితోనైనా ఛాట్ చేయాలనుకున్నప్పుడు వారు మనకు స్పందించకపోతే నెటిజన్లు ఈ ఆప్షన్ వాడతారు. బ్రిటన్ లో రిచర్డ్ రావెటో (29) అనే వ్యక్తి తన స్నేహితుడు స్కాట్ హంఫ్రీ (27) ప్రియురాలిని పోక్ చేశాడు. గతంలో తన ప్రియురాలికి మెసేజ్ లు పెట్టొద్దని హంఫ్రీ పలుమార్లు రావెటోను హెచ్చరించాడు. అయినప్పటికీ రావెటో బుద్ధి మార్చుకోకపోవడంతో, ఓ క్యాబ్ లో దొరకబుచ్చుకుని గట్టిగా కొట్టాడు. దీంతో, అతడు క్యాబ్ లోంచి పడిపోయాడు. ఈ పడడంలో అతని తల నేలకు కొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో, హంఫ్రీకి నాలుగేళ్ల నాలుగు నెలల జైలుశిక్ష విధించారు.

  • Loading...

More Telugu News