: రెండు కంపెనీలుగా హెచ్ పీ (హ్యూలెట్-ప్యాకార్డ్)!


హార్డ్ వేర్, సాప్ట్ వేర్ రంగాల్లో తనకంటూ ఓ సమున్నత స్థానాన్ని సంపాదించుకున్న హెచ్ పీ (హ్యూలెట్ - ప్యాకార్డ్) ఇకపై రెండుగా విడపోనుందట. ఇద్దరు మిత్రుల పేర్ల కలయికతో 1939 లో అరంగేట్రం చేసిన హెచ్ పీ, వచ్చే ఏడాది నాటికి రెండుగా విడిపోనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ సేవల కార్యకలాపాల కోసం ఓ విభాగం పనిచేయనుండగా, మరో విభాగం ప్రింటర్ల వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించనుందని ఆ కంపెనీ వెల్లడించింది. వేగంగా విస్తరిస్తున్న కార్పొరేట్ హార్డ్ వేర్, ఆపరేషన్స్ విభాగాల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకే ఈ విభజన జరగనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News