: తీహార్ జైల్లో ఉన్నవారి మద్దతు అవసరం లేదు: మోడీ


మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. సోనియా నుంచి హుడా దాకా కడిగిపారేసిన మోడీ, ఎన్సీపీ నుంచి ఐఎన్ఎల్డీ దాకా ఏ పార్టీని వదలడం లేదు. సోమవారం హర్యానా ప్రచారంలో పాల్గొన్న మోడీ, ఐఎన్ఎల్డీ చీఫ్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాపై విరుచుకుపడ్డారు. ‘‘తీహార్ జైల్లో ఉన్న వారి మద్దతు మాకు అవసరం లేదు’’ అంటూ మోడీ, చౌతాలాకు చురకలంటించారు. తద్వారా అవినీతి కేసుల్లో ఇరుక్కున్న రాజకీయ నేత ఆధ్వర్యంలోని ఐఎన్ఎల్డీ తో ఎన్నికల అనంతరం ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని మోడీ కుండబద్దలు కొట్టారు. టీచర్ల కుంభకోణంలో దోషిగా తేలిన చౌతాలాకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News