: ముఖ్యమంత్రి గారు! మీరేం చేస్తారో తెలియదు, మాకు కాస్త ఎక్కువ మేలు చేయండి!: జేసీ
'ముఖ్యమంత్రిగారూ! మీరేం చేస్తారో తెలియదు కానీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లా కాకుండా, మా జిల్లాకు ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా చేస్తానని మాటివ్వాల్సిందే'నని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురంజిల్లా గరుడాపురంలో వ్యవసాయమిషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అనంతపురం జిల్లా అభివృద్ధిలో అట్టడుగున ఉందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో నీళ్లు, విద్యుత్, ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కృష్ణా నదీ జలాలను అనంతపురం జిల్లాకు తక్షణం రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.