: ఫ్లిప్ కార్ట్ కు పోటెత్తిన ఆర్డర్లు... మొరాయించిన సర్వర్లు!


‘ద బిగ్ బిలియన్ డే’ పథకం కారణంగా ఫ్లిప్ కార్ట్ కు ఆర్డర్లు వెల్లువెత్తాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఈ కొత్త స్కీం ప్రారంభం కాగానే లక్షలాది మంది వినియోగదారులు తమ ఆర్డర్లతో ఫ్లిప్ కార్ట్ ను ముంచేశారు. దీంతో సంబంధిత సర్వర్లు మొరాయించాయి. అయినా శాంతించని వినియోగదారులు ట్విట్టర్ ద్వారా తమ ఆర్డర్లను ఫ్లిప్ కార్ట్ కు పంపేందుకు శతధా యత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, బిగ్ బిలియన్ డే పథకం కింద, సోమవారం తాము రికార్డు స్థాయిలో ఆర్డర్లను సాధించామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ ఆర్డర్ల ద్వారా వివిధ వస్తువులను వినియోగదారులకు చేరవేసేందుకు 10 వేల మంది సిబ్బందిని రంగంలోకి దింపుతున్నట్లు వెల్లడించింది.

  • Loading...

More Telugu News